Akhanda 2: అఖండ 2 లేటెస్ట్ అప్డేట్..! 1 d ago

featured-image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన "అఖండ" మూవీ భారీ విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా రానున్న "అఖండ 2" పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూట్ కోసం బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం నుంచి మూవీ లోని కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ షూట్ లో బాలయ్య జాయిన్ అవ్వట్లేదని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అనంతరం ఫిబ్రవరి 2వ వారం లో జరగబోయే షెడ్యూల్ ను పూర్తిగా బాలయ్య పై ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకం పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదవ్వడం తో అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD